Abn logo
May 8 2020 @ 23:18PM

‘పోకిరి’కి హీరోయిన్‌గా ఫస్ట్ సెలక్టయింది ఎవరో తెలుసా..

బాలీవుడ్ కంగనా రనౌత్ రూటే సెపరేటు. ఎఫైర్స్ గురించి మాట్లాడినా, నెపోటిజంపై ప్రశ్నించినా, మీటూకి వంతు పాడినా.. కంగనా స్టైలే వేరు. అందుకే బీ టౌన్‌లో కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ కంగనా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. ప్రజంట్ బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కంగనా.. తొలి సినిమా విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు ఈ ముద్దుగుమ్మ ‘పోకిరి’తో ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉందట. 


మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలో ఫస్ట్ హీరోయిన్‌గా ఎంపికైంది కంగనా రనౌత్ అట. ముంబైలో కంగనాను ఆడిషన్ చేసిన పూరీ జగన్నాధ్ ‘పోకిరి’కి హీరోయిన్‌గా ఫిక్స్ చేశాడట. అయితే అదే సమయంలో మహేష్ భట్ నిర్మించిన ‘గ్యాంగ్‌స్టర్’లో ఆఫర్ రావడంతో టాలీవుడ్‌ని పక్కన పెట్టి బాలీవుడ్‌ని ఎంపిక చేసుకుందట ఈ భామ. ఈ విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కంగనానే చెప్పడం విశేషం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇటు పోకిరి, అటు గ్యాంగ్‌స్టర్ చిత్రాలు ఒకే రోజు 28 ఏప్రిల్ 2006న విడుదలవ్వడం. ఇక పోకిరి మహేష్ బాబు కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలవగా.. గ్యాంగ్‌స్టర్ బాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అయితే పోకిరితో నెరవేరని కంగనా టాలీవుడ్ కోరిక.. ఆ తర్వాత పూరీ దర్శకత్వంలో ‘ఏక్ నిరంజన్’తో తీరడం విశేషం.

Advertisement
Advertisement
Advertisement