యాదాద్రి జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2020-06-01T09:56:16+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి

యాదాద్రి జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు

భువనగిరి టౌన్‌ / చింతపల్లి / మోత్కూరు, మే 31 : యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన దంపతులు మే 13న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా, భర్త మృతిచెందాడు. అప్పటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న భార్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు ఆదివా రం నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న ఆమెను పరామర్శించడానికి వచ్చిన బంధువులను గుర్తించి హోంక్వారంటైన్‌ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.


ఎస్‌.లింగోటంలో ఇప్పటివరకు ఎలాంటి కేసు లు లేకపోవడం, ఉస్మానియా ఆస్పత్రిలో ఇన్నిరోజులుగా ఉండడంతో, అలా ఏమైనా వైరస్‌ వచ్చి ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి మండలంలోని ఓ పంచాయతీ కార్యదర్శికి  కరోనా నెగెటివ్‌గా వైద్యులు నిర్దారించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ కార్యదర్శి సోదరికి పాజిటివ్‌ రా వడంతో అందరూ ఆందోళన చెందారు. పరీక్షల్లో పంచాయతీ కార్యదర్శికి నెగిటివ్‌ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మోత్కూరు మండలంలోని వివిధ గ్రా మాలకు ముంబయి నుంచి వచ్చిన ఆరుగురికి, చెన్నై నుంచి వచ్చిన నలుగురికి హోం క్వారంటైన్‌ స్టాంపులు వేసినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి కిషోర్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-06-01T09:56:16+05:30 IST