ఈ సిరీస్ తో మళ్లీ..

ABN , First Publish Date - 2020-03-12T10:05:36+05:30 IST

స్వదేశంలో అద్భుత విజయాలతో కివీ్‌సగడ్డపై అడుగుపెట్టి ఐదు టీ20ల సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేయడం ద్వారా భారత్‌ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

ఈ సిరీస్ తో మళ్లీ..

టీ20 వరల్డ్‌కప్‌ ఏడాదిలో వన్డే మ్యాచ్‌లకు పెద్దగా ప్రాధాన్యం లేదని కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్ర్తి అభిప్రాయపడినా.. 50 ఓవర్ల సిరీస్‌ అంటే సిరీసే. బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యంతో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలలో వైట్‌వా్‌షకు లోనైన టీమిండియా స్వదేశంలో మరో సిరీ్‌సకు సిద్ధమైంది. అటు కరోనా భయం ఇటు వాన ముప్పు పొంచి ఉండగా, సౌతాఫ్రికాను తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది. స్వదేశం, బ్యాటింగ్‌ అనుకూలించే పిచ్‌లపై చెలరేగి సిరీ్‌సను కైవసం చేసుకోవడమే కివీస్‌ ‘గాయాని’కి మందుగా కోహ్లీసేన భావిస్తోంది. అయితే బుధవారం వరుణుడు పలకరించాడు. గురువారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.


సత్తాచాటేందుకు భారత్‌ తహతహ

సౌతాఫ్రికాతో నేడు తొలి వన్డే

మ్యాచ్‌కు వర్షం ముప్పు


ధర్మశాల: స్వదేశంలో అద్భుత విజయాలతో కివీ్‌సగడ్డపై అడుగుపెట్టి ఐదు టీ20ల సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేయడం ద్వారా భారత్‌ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కానీ ఆపై మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల్లో ఘోర పరాజయంతో తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ రెండు సిరీ్‌సలలో బౌలర్లు సత్తా చాటినా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడం ఓటమికి కారణమైంది. అయితే శిఖర్‌ ధవన్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ పునరాగమనం చేయడంతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ విభాగంకూడా బలీయంగా మారింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా ఆధిపత్యం చూపగలదని అభిమానులు ఆశిస్తున్నారు. 


ఓపెనర్లు కీలకం..

ఏళ్లుగా భారత జట్టు ఓపెనర్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. వారిలో ఒక్కరు లేకపోయినా అది జట్టు బ్యాటింగ్‌పై పెను ప్రభావం చూపుతోంది. ఇది కివీస్‌ టూర్‌లో స్పష్టమైంది. గాయాలతో ధవన్‌, రోహిత్‌ ఆ టూర్‌కు దూరమయ్యారు. ఇక గబ్బర్‌, రోహిత్‌లో ఒకరి గైర్హాజరీలో గతంలో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఆడించారు. కానీ మిడిలార్డర్‌లో కుదురుకున్న రాహుల్‌ను ఓపెనర్‌గా పంపేందుకు జట్టు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో కివీస్‌ పర్యటనలో టాపార్డర్‌ బ్యాటింగ్‌ సమస్య మరీ తీవ్రమైంది. ఆ టూర్‌లో ఓపెనర్లుగా దిగిన పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా హాఫ్‌ సెంచరీ మార్కును చేరలేకపోయారు. ఈ తరుణంలో ధవన్‌ రాకతో జట్టు ఊపిరిపీల్చుకుంది. శస్త్రచికిత్స నుంచి కోలుకున్నాక డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో ఆల్‌రౌండ్‌ షోతో హార్దిక్‌ అదరగొట్టడం మరో శుభపరిణామం. న్యూజిలాండ్‌ పర్యటనలో విఫలమైన కోహ్లీ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. ఆ టూర్‌లో 75 రన్సే చేసిన విరాట్‌ ఈ సిరీ్‌సలో సత్తా చాటడం ద్వారా విమర్శలకు బదులివ్వాల్సిన అవసరముంది. 


ఎంపికలో తలనొప్పులు..

పాండ్యా, భువీ రీఎంట్రీ జట్టు ఎంపికలో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.  ఇది ఒకరకంగా మంచి పరిణామంగానే చెప్పాలి. పాండ్యా గైర్హాజరీలో ఆల్‌రౌండర్‌గా తాను ఎంత ముఖ్యమో జడేజా తెలియజెప్పాడు. మరి.. హార్దిక్‌ రాకతో జడేజాకు చోటు లభించేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కానీ ఏడోస్థానం వరకు బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు పాండ్యాతోపాటు జడేజానూ ఆడించే చాన్సుంది. అలా అయితే ఆరుగురు ఫ్రంట్‌లైన్‌ బౌలర్లు జట్టులో ఉన్నట్టవుతుంది. న్యూజిలాండ్‌తో రెండు వన్డేల్లో భారీ స్కోరును సంరక్షించుకొనే క్రమంలో ఆరో బౌలర్‌ లోటు బాగా కనిపించింది. భువనేశ్వర్‌ కూడా ఉండడంతో టెయిలెండ్‌లో బ్యాటింగ్‌ కూడా పటిష్ఠమవనుంది. పాండ్యా పునరాగమనంతో మనీష్‌ పాండే చోటు కోల్పోనున్నాడు. అగర్వాల్‌ స్థానంలో ధవన్‌, శార్దూల్‌కు బదులు భువి జట్టులోకి రానున్నారు. ఈ కూర్పు నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను తీసుకొనే సౌలభ్యం కలిగించనుంది.  


ఆత్మవిశ్వాసంలో సౌతాఫ్రికా

ఆస్ట్రేలియాపై స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో నెగ్గిన దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఈ పర్యటనకు వచ్చింది. గత ఏడాది చివర్లో భారత్‌లో కోహ్లీసేనతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సను 1-1తో ఆ జట్టు సమం చేసింది. డుప్లెసి రాకతో  వారి బ్యాటింగ్‌ బలపడింది. ఇక కెప్టెన్‌ డికాక్‌ భారత్‌పై ఎప్పుడూ చెలరేగుతాడు. అయితే బౌలింగ్‌ విభాగమే బలహీనంగా ఉంది. ఎంగిడి మినహా మిగిలిన పేసర్లకు పెద్దగా అనుభవం లేదు.


పొంచి ఉన్నవరుణుడు

ధర్మశాలలో సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌లు పూర్తిగా కొనసాగడం విశేషమే. గత సెప్టెంబరులో ఇక్కడ భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టీ20 వర్షంతో రద్దయింది. గురువారంనాటి మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇక ఇక్కడి పిచ్‌పై తొలుత ఫీల్డింగ్‌ చేసిన జట్టుకు కలిసి వస్తుంది. ఈ వికెట్‌పై జరిగిన నాలుగు వన్డేల్లో మూడుసార్లు చేజింగ్‌ చేసిన జట్టే నెగ్గింది. 2015లో టీమిండియా-సౌతాఫ్రికా నడుమ జరిగిన టీ20లో పర్యాటక జట్టు 200 రన్స్‌ను ఛేదించింది. డుప్లెసి, డేవిడ్‌ మిల్లర్‌ అప్పుడు తుది జట్టులో ఉన్నారు. 


20 సౌతాఫ్రికాపై ఏడు వన్డేలలో చాహల్‌ తీసిన వికెట్లు ఇవి. ఏ ప్రత్యర్థిపై అయినా వన్డేలలో అతడికి ఇవి అత్యధిక వికెట్లు.


31-10బుమ్రా-భువనేశ్వర్‌ కలిసి ఆడిన వన్డేల్లో భారత్‌ గెలుపోటముల రికార్డు ఇది.


జట్లు 

భారత్‌ (అంచనా): కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, పృథ్వీ షా, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, భువనేశ్వర్‌, నవ్‌దీప్‌ సైనీ, చాహల్‌, బుమ్రా.

సౌతాఫ్రికా: డికాక్‌ (కెప్టెన్‌), జెమీ మాలన్‌/బవుమా/స్మట్స్‌, డ్యూసెన్‌, డుప్లెసి, క్లాసెన్‌, మిల్లర్‌, పెహ్లుక్వాయో, కేశవ్‌ మహరాజ్‌, హెండ్రిక్స్‌/లిండే, నోర్జ్‌, ఎంగిడి.

Updated Date - 2020-03-12T10:05:36+05:30 IST