తొలి రెండు సెషన్సే కీలకం

ABN , First Publish Date - 2022-01-24T07:00:16+05:30 IST

గత వారం నిఫ్టీ మళ్లీ దిద్దుబాటుకు లోనైంది. 18,350 వద్ద కొద్దిపాటి దిద్దుబాటుకు లోనవుతుందనుకున్న నిఫ్టీ అన్ని అంచనాలను వమ్ము చేస్తూ 17,617.15 వద్ద ముగిసింది. ..

తొలి రెండు సెషన్సే కీలకం

గత వారం నిఫ్టీ మళ్లీ దిద్దుబాటుకు లోనైంది. 18,350 వద్ద కొద్దిపాటి దిద్దుబాటుకు లోనవుతుందనుకున్న నిఫ్టీ అన్ని అంచనాలను వమ్ము చేస్తూ 17,617.15 వద్ద ముగిసింది. 18,100 దిగువన కనీసం 17,800 వద్ద నిలదొక్కుకుంటుందన్న అంచనాలూ తారుమారై చివరి రెండు రోజుల్లో ఒక దశలో 17,500 స్థాయిని తాకింది. ఈ వారంలో కూడా మార్కెట్‌ అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ వారం నిఫ్టీకి 17,500-17,400 పాయింట్లను కీలక మద్దతు స్థాయిలుగా పరిగణించాలి. కనీసం 17,800కి చేరితేనే నిఫ్టీ మళ్లీ 18,000 పాయింట్ల మార్క్‌ను చేరే అవకాశం ఉంది. ఈ వారం తొలి రెండు రోజుల్లోనే ఈ విషయం తేలనుంది.


హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌: గత వారం ఎన్‌ఎ్‌సఈలో రూ.2,592.95 వద్ద ముగిసిన ఈ స్ర్కిప్‌ ఈ వారం బుల్లి ష్‌గా కనిపిస్తోంది. రూ.2,690 స్పల్ప కాలిక టార్గెట్‌ కోసం ట్రేడర్లు ఈ కౌంటర్లో ఎంటర్‌ కావచ్చు. కాకపోతే రూ.2,538ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


టైమ్‌ టెక్నో: గత వారం రూ.86.20 వద్ద ముగిసిన ఈ  కంపెనీ షేర్లు, ఈ వారం మరింత ముందుకు దూకే సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం అనేక ఫ్రంట్‌లైన్‌ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనా, ఈ కౌంటర్‌ మాత్రం లాభాలతో ముగిసింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ కౌంటర్లో ట్రేడయ్యే షేర్ల పరిమాణమూ గణనీయంగా పెరిగింది. రూ.102 మధ్యకాలిక టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.77.90ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌  అనలిస్ట్‌ 

(టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌), ఏంజెల్‌ ఒన్‌ లిమిటెడ్‌ 

Updated Date - 2022-01-24T07:00:16+05:30 IST