ముందు వేద్దాం.. తర్వాత చూద్దాం....

ABN , First Publish Date - 2021-04-17T06:01:48+05:30 IST

వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ వంటి ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్రులు కూడా పెద్ద ఎత్తున బరిలో దిగేందుకు ఉత్సాహ పడుతున్నారు.

ముందు వేద్దాం.. తర్వాత చూద్దాం....
నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్తున్న తాజా మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, రవీందర్‌

జీడబ్ల్యుఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ‘నామినేషన్‌’ వ్యూహం
నేడు, రేపు భారీ సంఖ్యలో దాఖలు
‘నామినేషన్‌’ వెనుక ఎవరి వ్యూహాలు వారివే
ఒక్కో డివిజన్‌లో 20 నుంచి 25 వరకు దాఖలయ్యే అవకాశం
బరిలోకి భారీగా స్వతంత్రులు
టికెట్ల కోసం కుల సంఘాల ఒత్తిళ్లు


హన్మకొండ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ మహానగర పాలక  సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌  వంటి ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్రులు కూడా పెద్ద ఎత్తున బరిలో దిగేందుకు ఉత్సాహ పడుతున్నారు. శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. ఈనెల 18వ తేదీ వరకు స్వీకరిస్తారు. శని, ఆదివారం మంచి రోజులయినందు వల్ల పోటీ చేయదలుచుకున్నవారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయనున్నారు. ఒక్కో డివిజన్‌ నుంచి ప్రఽ దాన పార్టీలతో కలుపుకొని 20 నుంచి 25 మంది వరకు నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్ల దా ఖలుకు గడువు మూడు రోజులే ఇచ్చినందు వల్ల  ఇంత తక్కువ సమయంలో అభ్యర్ధులను ఎంపిక చేసి వారికి బి ఫామ్‌లను ఇచ్చే స్థితిలో ప్రధాన పార్టీలు లేవు. దీంతో గ డువులోగానే అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు అన్ని ఏ ర్పాట్లు చేసుకుంటున్నారు. బి ఫామ్‌ దక్కిన వారు అధికా ర అభ్యర్ధిగా బరిలో ఉంటారు. లేనివారు స్వతంత్రులుగా పోటీ పడతారు. లేదంటే ఉపసంహరించుకుంటారు.

ఓ నామినేషన్‌ వేద్దాం..
డిపాజిట్‌ మొత్తం కూడా తక్కువే అయినందు వల్ల ఓ నామినేషన్‌ వేస్తే పోలా.! అనుకుంటున్నారు. ఆ మేరకు తొలి రోజునే దాదాపు 400 నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. శనివారం మరికొంత మంది తీసుకునే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేసి చివరి రోజున దాఖలు చేయనున్నారు. తమకు పార్టీ టికెట్‌ ఇవ్వడం ఖాయమనుకుంటున్నవారు, లాబీయింగ్‌ చేస్తే లక్కు దక్కక పోతుందా అని భావిస్తున్నవారు, ఇవ్వకపోతే తిరుగుబాటు అభ్యర్ధిగా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నవారు నామినేషన్ల దాఖలుకు సిద్ధపడుతున్నారు. ఆయా డివిజన్లలో కాస్త పలుకుబడి ఉన్నవారు. సామాజివర్గం మద్దతు ఉన్నవారు, ఓటర్లను కాస్తోకూస్తో ప్రభావితం చేయగల సత్తా ఉన్నవారు కూడా ఇండిపెండెటంట్‌గా నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రధాన పార్టీలు, ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు వ్యూహంలో భాగంగా తమను బుజ్జగించి బరిలో నుంచి తప్పించే ప్రయత్నం చేసినప్పుడు ఎంతో కొంత డిమాండ్‌ చేయవచ్చునన్నది కొందరి ఎత్తుగడ.  

బుజ్జగింపులు
విభేదాలు, అసంతృప్తి సెగలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చివరి నిమి షం వరకు అభ్యర్ధుల ఎంపికలో పార్టీలు గోప్యత పాటించనున్నాయి.  చివరి నిమిషంలో ఎంపికైన అభ్యర్ధులకు బి ఫామ్‌లు చేతికి ఇవ్వడమో లేక పార్టీ పక్షాన అధీకృత నేతలే నామినేషన్ల దాఖలు కేంద్రాలకు స్వయంగా వెళ్ళి తమ పార్టీ అ భ్యర్ధుల పక్షాన అందచేయడమో చేస్తారని తెలుస్తోంది. గతంలో కన్నా ఈ సారి 8 డివిజన్లు పెరిగినందు వల్ల నామినేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగనున్నది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన డివిజన్లలో కన్నా బీసీ, ఓసీ జనరల్‌ డివిజన్లలో పోటీ ఎక్కువ ఉంటుంది క నుక ఆ డివిజన్లలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నామినేషన్ల దాఖలును బట్టి తి రుగుబాటు, అసంతృప్తులు, స్వతంత్రులను గుర్తించి ఆ వెంటనే వారిని బుజ్జగించే పని ని నేతలు చేపట్టనున్నారు. ఉపసంహరణ గడువు తర్వాత తిరుగుబాటుదారులను తమ దారికి తెచ్చుకోవడం, స్వతంత్రులను తటస్తంగా ఉండేట్టు చేయడం కన్నా ముందే ఉపసంహరించుకునేట్టు చేయడం ఉత్తమంగా భావిస్తున్నారు.

ఎత్తులు
ప్రత్యర్ధి పార్టీకి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నా,  ఆ పార్టీ గెలిచే అవకాశాలున్న డివిజన్లలో ఓట్లను తీల్చడం ద్వారా గెలుపు అవకాశాలను తగ్గించే వ్యూహంలో భాగం గా స్వతంత్ర అభ్యర్ధులు ఎక్కువగా నిలబడేట్టు ప్రోత్సహించే వ్యూహం వల్ల కూడా నామినేషన్లు ఎక్కవ దాఖలయ్యే అవకాశం కూడా ఉంది. తమ సామాజికవర్గానికి ఇ న్ని టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీలను   డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవ్వని చోట ఆ సా మాజికవర్గం నుంచి కూడా పలువురు స్వతంత్రులుగా నిలబడే అవకాశం ఉం ది. వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు పార్టీ టికెట్ల కోసం తీవ్ర ఒత్తిళ్ళు తెస్తున్నారు. ఆయా కులాల ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని టికెట్లను కేటాయించాలని కోరుతున్నారు. ఆర్యవైశ్యులకు ఆరుగురు డివిజన్లలో టికెట్లు ఇవ్వాలని తాజా మాజీ మేయర్‌ గుండా ప్రకాశరావు డిమాండ్‌ చేయడం ఇందుకు తా జా ఉదాహరణ. అలాగే మున్నూరు కాపు, పద్మశాలి, బ్రాహ్మణ, రెడ్డి సామాజికవర్గాల వారి నుంచి కూడా టికెట్ల కోసం తీవ్ర ఒత్తిళ్ళు వస్తున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత గానీ బరిలో ఎంతో మంది, ఏ సామాజికవర్గాల వారు ఉన్నారనేది తేటతెల్లమవుతుంది. మొత్తా నికి నామినేషన్ల ఘట్టం ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయడంలో కీలకంగా నిలవనున్నది.

Updated Date - 2021-04-17T06:01:48+05:30 IST