‘ఆస్ట్రియా’ విజేత బొటాస్‌

ABN , First Publish Date - 2020-07-06T08:45:47+05:30 IST

ఈ ఏడాది జరిగిన తొలి ఫార్ములావన్‌ రేసులో ఫిన్లాండ్‌ డ్రైవర్‌ వాల్టెరి బొటాస్‌ విజేతగా నిలిచాడు. కరోనా కారణంగా నాలుగు నెలల ఆలస్యంగా...

‘ఆస్ట్రియా’ విజేత బొటాస్‌

నాలుగో స్థానానికి హామిల్టన్‌

స్పీల్‌బర్గ్‌: ఈ ఏడాది జరిగిన తొలి ఫార్ములావన్‌ రేసులో ఫిన్లాండ్‌ డ్రైవర్‌ వాల్టెరి బొటాస్‌ విజేతగా నిలిచాడు. కరోనా కారణంగా నాలుగు నెలల ఆలస్యంగా ఆదివారం ఈ ఆస్ట్రియా గ్రాండ్‌ప్రీ రేసు జరిగింది. 71 ల్యాప్‌ల పాటు జరిగిన ఈ పోరులో మెర్సిడెస్‌ డ్రైవర్‌ బొటాస్‌ 1:30:55.739 సెకన్ల టైమింగ్‌తో రేసును ఫినిష్‌ చేయగా.. ఆ తర్వాత లెక్లెరెక్‌ (+2.700), 20 ఏళ్ల నోరిస్‌ (+5.491) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి పోడియం దక్కించుకున్నారు. అయితే స్టార్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ను మాత్రం ఈ రేసులో దురదృష్టం వెంటాడింది. రేసుకు ముందే అతడు మూడు గ్రిడ్‌ల పెనాల్టీ ఎదుర్కోగా.. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ రేసులో మరో డ్రైవర్‌ అలెక్స్‌ అల్బోన్‌ను ఢీకొనడంతో ఐదు సెకన్ల పెనాల్టీ పడింది. దీంతో అతను రెండో స్థానంలో నిలిచినా, పెనాల్టీ కారణంగా నాలుగో స్థానానికి పడిపోయాడు.

Updated Date - 2020-07-06T08:45:47+05:30 IST