సాఫీగా తొలిరోజు పర్యటన

ABN , First Publish Date - 2022-05-28T05:15:24+05:30 IST

స్వంత మండలంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కు మార్‌రెడ్డి తొలి రోజు పర్యటన సాఫీగా జరి గింది. శుక్రవారం అభిమానులు, అనుయా యులను పలకరించి కుశల ప్రశ్నలు వేయ డానికే పరిమితమయ్యారు. శుక్రవారం ఉద యం 10 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన కలికిరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు.

సాఫీగా తొలిరోజు పర్యటన
అభిమానంతో వచ్చిన వారిని పలకరిస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి

అందరినీ ఆప్యాయంగా పలకరించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

కలికిరి, మే 27: స్వంత మండలంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కు మార్‌రెడ్డి తొలి రోజు పర్యటన సాఫీగా జరి గింది. శుక్రవారం అభిమానులు, అనుయా యులను పలకరించి కుశల ప్రశ్నలు వేయ డానికే పరిమితమయ్యారు. శుక్రవారం ఉద యం 10 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన కలికిరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. పలు మండ లాల నుంచి వచ్చిన కిరణ్‌ అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వచ్చిన వారందరినీ పేరు పేరునా పలకరించి రోజంతా ఆయన సరదాగా గడిపా రు. వ్యవసాయం దండగైపోయిందని, కరెం టు సరఫరా పరిస్థితి ఘోరంగా తయారైంద ని పలువురు వాపోయారు. పీలేరు నియో జకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చి న వారితో మాట్లాడటంతోనే రోజంతా గడిపా రు. పెద్దగా రాజకీయ ప్రస్తావనలు లేకుండా నే మర్యాదపూర్వక పలకరింపులతోనే సరిపు చ్చారు. కొంతమంది చనువుగా రాజకీయాల ను ప్రస్తావించబోయినా ఆయన చిరు నవ్వులతోనే దాటవేశారు. కాగా శనివారం మఽ ద్యాహ్నం వరకూ ఆయన కలికిరిలోనే గడప నున్నారు. 3 గంటలకు ఇక్కడి నుంచి బెంగు ళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ అమాస రాజశే ఖర్‌ రెడ్డి, గుర్రంకొండ మండల టీడీపీ నాయ కుడు దద్దాల హరిప్రసాద్‌నాయుడు, మాజీ మండలాధ్యక్షుడు నల్లారి ఆనందరెడ్డి, నల్లారి శ్రీధర్‌ రెడ్డి, సర్పంచులు రెడ్డిరాము, జాహీదా, ప్రేమనాథ రెడ్డి, వగళ్ల మాజీ సర్పంచు గోపా ల్‌రెడ్డి, సహదేవ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు వేణు, పీలేరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఆగామొహి ద్దీన్‌, డాక్టర్‌ శ్రీవర్ధన్‌, రెడ్డెప్పరెడ్డి, స్థానిక కిరణ్‌ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణప్ప, మదనపల్లె మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నరేష్‌కుమార్‌రెడ్డి, ముజీబ్‌హుసేన్‌, అన్ని మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ క్రియాశీలక కార్యకర్తలు కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన వారిలో వున్నారు. 

Updated Date - 2022-05-28T05:15:24+05:30 IST