ఒకటి నుంచి మాస్క్‌ ధరించకపోతే రూ. 250 జరిమానా

ABN , First Publish Date - 2022-04-29T16:47:05+05:30 IST

మాస్క్‌ ధరించని వారిపై ప్రభుత్వం మళ్లీ కొరడా ఝలిపించనుంది. కొవిడ్‌ కేసులు రాష్ట్రంలో క్రమేపీ పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా మాస్క్‌ ధారణను తప్పనిసరి చేసిన

ఒకటి నుంచి మాస్క్‌ ధరించకపోతే రూ. 250 జరిమానా

బెంగళూరు: మాస్క్‌ ధరించని వారిపై ప్రభుత్వం మళ్లీ కొరడా ఝలిపించనుంది. కొవిడ్‌ కేసులు రాష్ట్రంలో క్రమేపీ పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా మాస్క్‌ ధారణను తప్పనిసరి చేసిన ప్రభుత్వం మే 1 నుంచి కఠిన నియమాలను అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే కొవిడ్‌ హైలెవల్‌ కమిటీ కూడా ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి విధితమే. జరిమానా విధించడం ద్వారా కొవిడ్‌ నాల్గోవేవ్‌పై ప్రజలను జాగృత పరచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మాస్క్‌ ధరించని వారికి రూ.250 జరిమానా విధించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రజలు నిర్లక్ష్యపు బాట పట్టకుండా చూడాలని ప్రభుత్వం కాసింత కఠినంగానే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-04-29T16:47:05+05:30 IST