ఆసీస్‌ ఫుట్‌బాలర్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-03-29T10:03:06+05:30 IST

ఆస్ట్రేలియాకు చెందిన ఎ-లీగ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో అతడు ఈ వ్యాధి బారిన పడిన తొలి ఆసీస్‌ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌ అయ్యాడు...

ఆసీస్‌ ఫుట్‌బాలర్‌కు కరోనా

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాకు చెందిన ఎ-లీగ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో అతడు ఈ వ్యాధి బారిన పడిన తొలి ఆసీస్‌ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌ అయ్యాడు. న్యూకాజిల్‌ జెట్స్‌ తరఫున ఆడే ఆ ఆటగాడి పేరును లీగ్‌ నిర్వాహకులు వెల్లడించలేదు. శుక్రవారం అంతర్జాతీయ ఫ్లయిట్‌ ఎక్కేముందు అతడికి చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు న్యూకాజిల్‌ జట్టు సీఈఓ లారీ మెకిన్నా తెలిపాడు.

Updated Date - 2020-03-29T10:03:06+05:30 IST