Abn logo
Aug 31 2021 @ 09:09AM

Firozabad: డెంగీ జ్వరాల జోరుతో పాఠశాలలకు సెప్టెంబరు 6వరకు సెలవులు

32 మంది పిల్లల మృతి

ఫిరోజాబాద్ (ఉత్తర్ ప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వైరల్, డెంగీ జ్వరాల జోరుతో 32 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో సెప్టెంబరు 6వతేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని ఫిరోజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలుతున్న దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా 1 నుంచి 8వతరగతి వరకు పాఠశాలలను మూసిఉంచాలని నిర్ణయించామని జిల్లా మెజిస్ట్రేట్ చంద్రవిజయ్ సింగ్ చెప్పారు. డెంగీ జ్వరాలు ప్రబలుతుండటంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఫిరోజ్ పూర్ జిల్లాలో పర్యటించి ఆరోగ్య శాఖ పనితీరును సమీక్షించారు. వైరల్, డెంగీ జ్వరాలతో 32 మంది పిల్లలు, ఏడుగురు పెద్దలు మరణించారని సీఎం చెప్పారు. సీఎం ఆదేశాలతో పాఠశాలలకు సెలవు ప్రకటించడంతోపాటు ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.