కాల్పుల కలకలం

ABN , First Publish Date - 2022-08-20T05:43:44+05:30 IST

కాల్పుల కలకలం

కాల్పుల కలకలం

తాడ్వాయి అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఫైరింగ్‌!

సెంట్రీ అప్రమత్తతతో తప్పించుకున్న దళం  

టెంట్లు, సామగ్రి స్వాధీన పర్చుకున్న పోలీసులు

కొనసాగుతున్న కూంబింగ్‌

ములుగు, ఆగస్టు 19: ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్‌ అడవుల్లో శుక్రవారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదుగురుకాల్పులు జరిగినట్టు సమాచారం. సెంట్రీ అప్రమత్తతో మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల యాక్షన్‌టీం కమాండర్‌ భద్రు, మణుగూరు ఏరియా కమాండర్‌ మంతు, జనార్దన్‌ దళాలు 20 రోజులుగా తాడ్వాయి అరణ్యంలో సంచరిస్తున్నట్టు నిఘావర్గాలు పసిగట్టాయి. సమాచారం అందుకున్న స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. వీరాపూర్‌ అటవీ ప్రాంతంలో దళాలు సేదతీరుతున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల రాకను గమనించిన సెంట్రీ అప్రమత్తమయ్యాడు. వెంటనే సాయుధ మావోయిస్టులు డెన్‌ను ఖాళీ చేసే క్రమంలో నిత్యావసరాలు, సామగ్రిని వదిలేసి వెళ్లారు. అయితే కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు అతి సమీపంలోకి రావడంతో నక్సల్స్‌ కాల్పులు ప్రారంభించారని, అలర్టయిన పోలీసులు కూడా ఫైరింగ్‌కు దిగారని సమాచారం. సుమారు 15 నిమిషాలపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు తెలిసింది. అనంతరం మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించిన పోలీసులు అక్కడ లభ్యమైన సామగ్రిని స్వాధీనపర్చుకున్నట్టు సమాచారం.  

ముమ్మరంగా గాలింపు చర్యలు!

ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులో ఉంటుంది. ఫైరింగ్‌ అనంతరం మావోయిస్టులు పరారు కాగా వారు వెళ్లే అన్నిదారుల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశా రు. గోదావరి వరదల నేపథ్యంలో అధికారులంతా వర ద ముంపునకు గురైన ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెలరోజుల క్రితం రోడ్డు మార్గంలో వచ్చి ఏటూరునాగారం, మంగ పేట మండలాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పోలీసు లు అడవుల్లో కూంబింగ్‌ చేయడంతోపాటు వాహన తనిఖీలు, గస్తీలు చేపడుతున్నారు. అయినా సరిహద్దు లోని ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి ములుగు వైపు మావో యిస్టులు ఎలా.. ఎప్పుడు వచ్చారనే విషయమై పోలీ సులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు ఆశ్రయం పొందుతారనే అనుమానంతో గొత్తికోయగూడాలను తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తోంది.


Updated Date - 2022-08-20T05:43:44+05:30 IST