షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు

ABN , First Publish Date - 2022-05-25T05:48:16+05:30 IST

షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు

షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు

  • నగదు, సామగ్రి దగ్ధం 

కందుకూరు, మే 24: షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లోని నగదు, సామగ్రి దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండలంలోని దెబ్బడగూడలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కనపల్లి చంద్రయ్య మంగళవారం తన కూతురును పదవతరగతి పరీక్షలు రాయించడానికి ఉదయం మండల కేంద్రానికి వచ్చాడు. అదే సమయంలో ఇంట్లో విద్యుత్‌వైర్లకు షార్ట్‌సర్క్యూట్‌ వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించారు. ఈవిషయాన్ని స్థానికులు గుర్తించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఇంట్లో దాచిన రూ.10,500 నగదు, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితులు విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. 

Updated Date - 2022-05-25T05:48:16+05:30 IST