డంపింగ్‌ యార్డ్‌లో మంటలు

ABN , First Publish Date - 2021-06-13T05:10:39+05:30 IST

పట్టణ శివారు కొర్రపాడు రోడ్డులో గల మున్సిప ల్‌ డంపింగ్‌ యార్డ్‌లో భారీగా మంటలు చెలరేగాయి.

డంపింగ్‌ యార్డ్‌లో  మంటలు
విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను కమ్మేసిన పొగలు

ప్రొద్దుటూరు అర్బన్‌ జూన్‌ 12:  పట్టణ శివారు కొర్రపాడు రోడ్డులో గల మున్సిప ల్‌ డంపింగ్‌ యార్డ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈదురు గాలులకు యార్డ్‌ ను ఆనుకొని  పక్కనే ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు పొగలు కమ్ముకన్నాయి. దీంతో  ఏ క్షణం మంటలు ఎగబాకి సబ్‌సే ్టషన్‌ మీద పడితే జరిగే భారీప్రమాదం ను ఊహించ లేమని నార్త్‌ ఏఈ హరిక్రిష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మున్సిపల్‌ కమిషనర్‌ రాధ, అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌లకు వీడియోలతో సహా వాట్సప్‌లో పెట్టి ఫిర్యాదు చేసినప్పటికి  స్పందించలేదని ఏఈ హరిక్రిష్ష ఆరోపిస్తు న్నారు.  ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2021-06-13T05:10:39+05:30 IST