ఢిల్లీ యూపీఎస్‌సీ భవనంలో అగ్నిప్రమాదం.. మాక్ డ్రిల్ అన్న అధికారులు

ABN , First Publish Date - 2022-06-11T00:09:21+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని షాజహాన్‌పూర్ రోడ్డులో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భవనంలోని నాలుగో

ఢిల్లీ యూపీఎస్‌సీ భవనంలో అగ్నిప్రమాదం.. మాక్ డ్రిల్ అన్న అధికారులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాజహాన్‌పూర్ రోడ్డులో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భవనంలోని నాలుగో అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. యూపీఎస్‌సీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఇదంతా తూచ్ అని, ప్రమాదం సంభవిస్తే ఎలా వ్యవహరించాలన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.  


Updated Date - 2022-06-11T00:09:21+05:30 IST