తల్వేదలో తాటివనానికి నిప్పు

ABN , First Publish Date - 2022-05-11T06:51:10+05:30 IST

నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో ఉన్న తాటి వనానికి మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. సుమారు 300కు పైగా చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెల రేగడంలో స్థానికులు, రైతులు ఆర్మూర్‌లోని అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపే సుమారు 300పైగా తాటిచె ట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయినప్పటికీ అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించడంతో మిగతా చెట్లను కాపాడారు. సుమారు రూ.మూడు లక్షల వరకు నష్టం జరిగినట్టు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది జె.మధుసూ దన్‌రెడ్డి, ప్రకాష్‌, రాజేందర్‌, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

తల్వేదలో తాటివనానికి నిప్పు

నందిపేట, మే10: నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో ఉన్న తాటి వనానికి మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. సుమారు 300కు పైగా చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెల రేగడంలో స్థానికులు, రైతులు ఆర్మూర్‌లోని అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపే సుమారు 300పైగా తాటిచె ట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయినప్పటికీ అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించడంతో మిగతా చెట్లను కాపాడారు. సుమారు రూ.మూడు లక్షల వరకు నష్టం జరిగినట్టు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది జె.మధుసూ దన్‌రెడ్డి, ప్రకాష్‌, రాజేందర్‌, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more