పెళ్లిసామాన్లకు నిప్పు.. కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

ఆ ఇంట మూడు రోజుల క్రితం పెళ్లి తంతు జరుగగా, ఆదివారం మలిపెళ్లి జరుపుకున్నారు.

పెళ్లిసామాన్లకు నిప్పు.. కేసు నమోదు
కాలిపోయిన కుర్చీలు, షామియానాలు, వంటసామాగ్రి

ప్రొద్దుటూరు క్రైం, మే 16 : ఆ ఇంట మూడు రోజుల క్రితం పెళ్లి తంతు జరుగగా, ఆదివారం మలిపెళ్లి జరుపుకున్నారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక, శుభకార్యం కోసం బాడుగకు తెచ్చుకున్న కుర్చీలు, షామీయానాలు, వంటసామగ్రి వెనక్కి ఇచ్చేందుకు ట్రాక్టర్‌ ట్రాలీలో ఉంచగా, గుర్తు తెలియని వ్యక్తులు వాటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి చౌడూరు గ్రామానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాసులు ఇంట్లో మూడు రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఆదివారం మలిపెళ్లి పెట్టుకోగా, దీని కోసం షామియానా, కుర్చీలు, వంటసామాన్లు అద్దెకు తెచ్చుకున్నారు. కాగా కార్యక్రమం పూర్తయ్యాక, వాటిని వెనక్కి ఇచ్చిందుకు ట్రాక్టర్‌ ట్రాలీలో ఉంచారు. ఆదివారం సప్లయర్స్‌ ఉండరని తెలుసుకుని, పెళ్లిసామాన్లతో పాటు ట్రాక్టర్‌ను ఇంటికి సమీపంలోని దేవాలయం వద్ద ఉంచారు. ఆర్థరాత్రి ఒంటి గంట సమయంలో అక్కడ మంటలు రాగా వారే ఆర్పివేశారు. అయితే కుర్చీలు, షామియానాలు, వంటసామగ్రి కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, సుమారు రూ.1లక్ష నష్టం వాటిల్లినట్లు శ్రీనివాసులు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు. 

 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST