అప్రమత్తతో ప్రమాదాలను అరికట్టాలి

ABN , First Publish Date - 2021-04-16T05:13:07+05:30 IST

అప్రత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాలను అరికట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా అనురాధ పిలుపునిచ్చారు. అగ్రిమాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

అప్రమత్తతో ప్రమాదాలను అరికట్టాలి
ర్యాలీని ప్రారంభిస్తున్న కమిషనర్‌ చల్లా అనురాధ, డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి

గుంటూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): అప్రత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాలను అరికట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా అనురాధ పిలుపునిచ్చారు. అగ్రిమాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా గురువారం  నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి మార్కెట్‌సెంటర్‌, జిన్నాటవర్‌సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ మీదగా నాజ్‌ సెంటర్‌ వరకు అగ్నిమాపక వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. నాజ్‌ సెంటర్‌లో వివిధ వివిధ పరికరాలతో ప్రదర్శన నిర్వహించి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి, అగ్నిమాపకశాఖ మాజీ అధికారి ఎస్‌ సాయిబాబ, గుంటూరు 1, 2 స్టేషన్‌ అఫీసర్లు వేణుగోపాలరావు, రమణారెడ్డి, సహాయ అధికారి గణేష్‌కుమార్‌, లీడింగ్‌ ఫైర్‌మన్లు శివరామప్రసాద్‌, ఎం రామకోటి, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-16T05:13:07+05:30 IST