పంటకు ‘మంట’..!

ABN , First Publish Date - 2020-10-24T09:27:57+05:30 IST

ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేస్తే.. కోతకు వచ్చిన పంట దోమపోటుతో దెబ్బతిందని ఆగ్రహం చెందిన రైతులు పైరుకు నిప్పంటించకున్నారు.

పంటకు ‘మంట’..!

 కామారెడ్డి/గంభీరావుపేట: ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేస్తే.. కోతకు వచ్చిన పంట దోమపోటుతో దెబ్బతిందని ఆగ్రహం చెందిన రైతులు  పైరుకు నిప్పంటించకున్నారు. కామారెడ్డి జిల్లా లింగాపూర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలలో శుక్రవారం ఈ ఘటనలు జరిగాయి. లింగాపూర్‌కు చెందిన రైతు నారాయణ, ఆంజనేయులు, గంభీరావుపేటలో రైతు దేవరాజులు వరి సాగు చేయగా దోమపోటు తెగులు సోకి పాడై పోయింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో  తీవ్ర ఆవేదనకు గురయ్యారు.   దీంతో పంటకు నిప్పంటించుకుని నిరసన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-10-24T09:27:57+05:30 IST