ఉట్నూర్‌ మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-28T09:21:41+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మద్యం డిపోలో బుధవారం షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో..

ఉట్నూర్‌ మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మద్యం డిపోలో బుధవారం షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ఘటనలో సుమారు రూ.100 కోట్ల విలువైన మద్యం కూడా పాడైపోయిందని అధికారులు అంచనా వేశారు. పురాతన గోదాంలు కావడం, గత కొన్నేళ్లుగా విద్యుత్‌ మరమ్మతులు చేపట్టక పోవడంతోనే షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకుందని అధికారు లు అభిప్రాయపడుతున్నారు. దర్యాప్తు బృందం పరిశీలించిన అనంతరమే అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణాలు, జరిగిన నష్టం గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవీందర్‌రాజు తెలిపారు. కాగా మద్యం డిపోలో అగ్ని ప్రమాదంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు పూర్తిస్థాయిలో మద్యం సరఫరా నిలిచి పోయింది.  


Updated Date - 2021-10-28T09:21:41+05:30 IST