లెబనాన్ ఘటన మరువకముందే.. బ్రిటన్‌లో మరో..!

ABN , First Publish Date - 2020-08-08T23:50:36+05:30 IST

లెబనాన్ ఘటన మరువకముందే బ్రిటన్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో

లెబనాన్ ఘటన మరువకముందే.. బ్రిటన్‌లో మరో..!

లండన్: లెబనాన్ ఘటన మరువకముందే బ్రిటన్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని న్యూహావెన్ ప్రాంతంలో ఉన్న ఓ  ఫ్యాక్టరీలో భారీ పెలుడు సంభవించింది. దీంతో ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అంతేకాకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో.. చుట్టు పక్కల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి గత కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో  ఎంత మంది గాయపడ్డారన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. ఫ్యాక్టరీ నుంచి భారీ స్థాయిలో పొగ వెలువడుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


Updated Date - 2020-08-08T23:50:36+05:30 IST