షిప్‌యార్డులో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-19T06:11:36+05:30 IST

షిప్‌యార్డులో నిర్మాణంలో ఉన్న ఓ నౌకలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు

షిప్‌యార్డులో అగ్ని ప్రమాదం
గాయపడిన అప్పారావును ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది

కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు 

మల్కాపురం, మే 18: షిప్‌యార్డులో నిర్మాణంలో ఉన్న ఓ నౌకలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీసీ 11190 నౌక నిర్మాణంలో భాగంగా గ్యాస్‌ కటింగ్‌ పనులు చేస్తుండగా, గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న వెల్డర్‌ బీకేఎస్‌ అప్పారావు (41) తీవ్రంగా గాయపడ్డాడు. సహచర సిబ్బంది మంటలను అదుపుచేసి, అప్పారావును కేజీహెచ్‌కు తరలించారు. మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-19T06:11:36+05:30 IST