పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-23T21:37:23+05:30 IST

జిల్లాలోని పరవాడ మండలం జవహర్‌లాల్ ఫార్మా సిటీ ఎస్ఎన్ఎఫ్

పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం

అనకాపల్లి: జిల్లాలోని పరవాడ మండలం జవహర్‌లాల్ ఫార్మా సిటీ ఎస్ఎన్ఎఫ్ ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం లేకపోవడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-23T21:37:23+05:30 IST