hyderabad:రాయదుర్గం గ్రీన్‎బావర్చి హోటల్‎లో భారీ అగ్నిప్రమాదం..

ABN , First Publish Date - 2022-05-28T17:53:07+05:30 IST

రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్

hyderabad:రాయదుర్గం గ్రీన్‎బావర్చి హోటల్‎లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌:  రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హోటల్  పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది.ఒక్కసారిగా హోటల్ నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. భయంతో హోటల్‌ నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

 నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మాణం

ఘటనాస్థలానికి  4 ఫైరింజన్లు చేరుకున్నాయి.అయితే.. హోటల్‎లో సుమారుగా 20 మంది ఉండగా..10 మందిని సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. హోటల్‎లో ఉన్న మరో 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.బాహుబలి స్కైలిఫ్ట్‌తో బాధితులను  రెస్క్యూ టీం రక్షిస్తుంది.  ఘటనాస్థలంలో రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది.  నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మాణం చేపటినట్లు తెలుస్తోంది. కనీసం సెట్ బ్యాక్ లేకుండా నిర్వాహకులు బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు.


రెండోఫ్లోర్‌లో అగ్నిప్రమాదం: ఫైర్ ఆఫీసర్‌ శ్రీధర్

భవనం రెండోఫ్లోర్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్‌ శ్రీధర్ తెలిపారు. భవనంలో  మంటలు వ్యాపించడంతో థర్డ్‌ఫ్లోర్‌లోకి ఉద్యోగులు పరుగెత్తారు. మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించినట్లు చెప్పారు. రెండోఫ్లోర్‌లో మంటలను అదుపు చేస్తున్నామన్నారు. భారీగా పొగ కమ్ముకోవడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఫైర్ ఆఫీసర్‌ శ్రీధర్ మీడియాకు తెలిపారు. 

Updated Date - 2022-05-28T17:53:07+05:30 IST