భూమా సినీ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-10-24T06:58:31+05:30 IST

తిరుపతి భూమా సినీ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపకాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..

భూమా సినీ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం
విఖ్యాత్‌ థియేటర్‌లో అగ్నికి ఆహుతవుతున్న సీట్లు

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 23: తిరుపతి భూమా సినీ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపకాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో భూమా సినీ కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించాయి. విఖ్యాత్‌ థియేటర్‌లోని బాల్కనీ నుంచి దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైర్‌ ఇంజిన్లతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే బాల్కనీలో వ్యాపించిన మంటలను అదుపు చేశారు. అప్పటికే 180 సీట్లు కాలిపోయాయని, దీనివల్ల సుమారు రూ.6-7 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-10-24T06:58:31+05:30 IST