Abn logo
Dec 2 2020 @ 23:53PM

అమ్మపాలెంలో అగ్ని ప్రమాదం

శృంగవరపుకోట రూరల్‌ : బొడ్డవర పంచాయతీ అమ్మపాలెంలో బుధ వారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు పూ రిళ్లుతోపాటు రెండు పాకలు దగ్ధమయ్యాయి. బాధితులు జన్ని ఎర్రయ్య, గంగరాజు, ఈశ్వరరావు కూలీ పనులకు పక్క గ్రామానికి వెళ్లగా... విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఈ ముగ్గురికి చెందిన రూ.ఆరు లక్షలతోపాటు బంగారం, ధ్రువపత్రాలు, నిత్యావసర సరుకులు, దుస్తులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రామారావు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా గ్రామానికి చెందిన బుద్దరాజు మురళీరాజు బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రమాద వివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వీఆర్‌వో సోమరాజు, పంచాయతీ కార్యదర్శి బంగారునాయుడు తెలిపారు.

సతివాడలో పశువుల శాలలు...

నెల్లిమర్ల : సతివాడ గ్రామ పరిధి ముళ్లు కళ్లాల వద్ద అగ్ని ప్రమాదం సం భవించింది. ఈ ప్రమాదంలో మూడు పశువుల శాలలు దగ్ధమయ్యాయి. ఆ గ్రా మానికి చెందిన చందక నాయరాయణ, చందక లక్ష్మణ్‌, చంద్రక సత్యవతమ్మకు చెందిన శాలలు కాలిపోగా, అందులో ఉన్న ట్రాక్టర్ల కొత్త టైర్లు ఎనిమిది, స్రేయిం గ్‌ మిషన్లు రెండు, సైకిళ్లు మూడు, మోటర్‌ ఇంజిన్లు రెండు దగ్ధమయ్యాయి.  


 

Advertisement
Advertisement
Advertisement