Abn logo
Sep 26 2021 @ 00:25AM

అగ్ని ప్రమాదంలో రూ.10కోట్ల ఆస్తి నష్టం

అగ్ని ప్రమాద వివరాలను మిల్లు అధికారులను అడిగి తెలుసుకుంటున్న డీఎస్‌పి విజయభాస్కర్‌

అదుపులోకి వచ్చిన మంటలు

పరిశీలించిన ఆర్డీవో, డీఎస్పీ 

యడ్లపాడు, సెప్టెంబరు 25: చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన యడ్లపాడు గ్రామ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్స్‌ గోడౌన్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా మంటలు శనివారం అదుపులోకి వచ్చాయి. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ఫైర్‌ ఇంజన్లతోపాటు, 30 ట్యాంకర్ల సహాయంతో 12 గంటలపాటు శ్రమించి శనివారం ఉదయానికి అదుపులోకి తెచ్చారు. నరసరావుపేట ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, డీఎస్పీ విజయభాస్కర్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ రాంబాబు, ఆర్‌ఐ అనూరాధలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. గోడౌన్‌లో ఏ గ్రేడ్‌ రకం దూదిబేళ్ళు 1,307, బీ గ్రేడ్‌ రకం 1,330 ఉన్నాయని వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు అన్‌లైన్‌ చేసిన వివరాలను మిల్లు ప్రొడక్షన్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు దగ్ధమైన దూదిబేళ్ళు, ధ్వంసమైన గోడౌన్‌ విలువ సుమారు రూ.10కోట్లు ఉంటుందని ఆయన అధికారులకు తెలియజేశారు.