కృష్ణా: జిల్లాలోని గుడివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ముబారక్ సెంటర్లో పాత ఎలక్ట్రానిక్స్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించాయి. గోదాములో లక్షలాది రూపాయల విలువైన ఎలక్ట్రికల్ పరికరాలు దగ్ధమయ్యాయి. గోదాము సమీపంలోని రెండు గడ్డివాములు, ఇళ్లకు సైతం మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది.