ఇలా బయటపడ్డారు..

ABN , First Publish Date - 2020-08-10T09:29:59+05:30 IST

ఒకపక్క దట్టమైన పొగ.... మరోపక్క మంటలు.... తమను కాపాడాలని కొవిడ్‌ బాధితుల హాహాకారాలు. ప్రాణభయంతో అటుఇటూ కొందరి పరుగులు.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందికి

ఇలా బయటపడ్డారు..

  • ‘చైర్‌ నాట్‌’తో 28మందిని కాపాడారు 

ఒకపక్క దట్టమైన పొగ.... మరోపక్క మంటలు.... తమను కాపాడాలని కొవిడ్‌ బాధితుల హాహాకారాలు. ప్రాణభయంతో అటుఇటూ కొందరి పరుగులు.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందికి కనిపించిన దృశ్యాలు ఇవీ.. లోపలకు వెళ్లే మార్గం కనిపించక పోవడంతో 4 అంతస్తుల వరకు నిచ్చెన వేసుకున్న అగ్నిమాపక సిబ్బంది ముందుగా కిటికీ అద్దాలు పగలగొట్టారు. ఒక్కో అంతస్తులోకి నలుగురైదుగురు సిబ్బంది వెళ్లారు. మెట్లమార్గం వైపు పొగ కమ్మేయడంతో అటునుంచి కిందికి వచ్చే అవకాశం లేదు. దీంతో చైర్‌నాట్‌ టెక్నిక్‌ను ఉపయోగించారు. తాడులో బాధితులు కూర్చునేందుకు వీలుగా ముడులు వేశారు. ఆ బాక్స్‌ల్లో వారిని కూర్చోబెట్టి తాడును నెమ్మదిగా కిందికి వదిలారు.


కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలు దక్కించుకున్నా

‘నా పేరు చౌడవరపు పవన్‌సాయి కిషన్‌. మాది జగ్గయ్యపేట. పాజిటివ్‌గా నిర్ధారించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరా. అయితే అక్కడ సౌకర్యాలు బాగోలేకపోవడంతో శనివారమే స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చాను. ఆదివారం ఉదయం 4గంటల సమయంలో గది నిండా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడక మెలకువ వచ్చింది. చూస్తే బయట మంటలు రేగుతున్నాయి. వెంటనే కిటికీ అద్దాలు పగలగొట్టుకుని బాల్కనీలోకి వచ్చి పోలీసులు, ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌ చేశా. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షించారు.’.


నలుగురు మృత్యుంజయులు

స్వర్ణ ప్యాలె్‌సలో సంభవించిన అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న మరో నలుగురు మృత్యుంజయులుగా నిలిచారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌, ఒక ఐఏఎస్‌ అధికారితో పాటు మరో ఇద్దరు ప్రమాదం జరగడానికి ముందురోజు సాయంత్రమే ఇక్కడి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2020-08-10T09:29:59+05:30 IST