Abn logo
Aug 2 2021 @ 01:11AM

స్ర్కాప్‌ గోదాంలో అగ్నిప్రమాదం

కొత్తపేట, ఆగస్ట్‌ 1 (ఆంధ్రజ్యోతి): స్ర్కాప్‌ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎల్‌బీనగర్‌ ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్‌లో నివసిస్తున్న భలేముల జలపతిరెడ్డి(38) ఆరు నెలల నుంచి సాగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో రేకుల షెడ్డులో స్ర్కాప్‌ గోదాం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు గోదాంలో మంటలు చెలరేగాయి. గమనించిన వాచ్‌మన్‌ విక్రమ్‌యాదవ్‌ జలపతిరెడ్డికి విషయం చెప్పగా.. పోలీసులు, అగ్నిమాపక కేంద్రాలకు ఆయన సమాచారం ఇచ్చారు. మల్కాజిగిరి, మౌలాలి, మలక్‌పేట, హయత్‌నగర్‌ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో చెత్త తరలించే రెండు మినీ వాహనాలు, ప్రైవేట్‌ బస్సు రబ్బర్‌, ప్లాస్టిక్‌, పేపర్‌ కారు బోర్డు వ్యర్థాలు కాలిపోయాయి. సుమారు రూ. 50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. జలపతిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

హైదరాబాద్మరిన్ని...