బైక్ లేదా కారుపై స్టంట్ చేస్తే జైలుకే!

ABN , First Publish Date - 2020-09-28T11:55:46+05:30 IST

బైక్ లేదా కారుపై స్టంట్ చేసేవారిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి స్టంట్లు చేసేవారిపై పోలీసులు సాధారణ చర్యలు తీసుకునేవారు.

బైక్ లేదా కారుపై స్టంట్ చేస్తే జైలుకే!

న్యూఢిల్లీ: బైక్ లేదా కారుపై స్టంట్ చేసేవారిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి స్టంట్లు చేసేవారిపై పోలీసులు సాధారణ చర్యలు తీసుకునేవారు. తాజాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ్ పోలీసు అధికారులు ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ బైక్ లేదా కారుపై స్టంట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్లు నిర్వహించేవారిపై వాహన చట్టం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసు కమిషనర్ ఆదేశించారు. 


స్టంట్ చేసేటప్పుడు ఎవరికైనా గాయం అయితే వారిపై సెక్షన్ 337 ను జత చేర్చాలని ఆదేశించారు. ఇటీవల ఢిల్లీలోని వికాస్ మార్గ్‌లోని కొంతమంది యువకులు హెల్మెట్ ధరించకుండా బైక్‌లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశరాజధానిలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించేవారిపై దృష్టి సారించనున్నారు. 

Updated Date - 2020-09-28T11:55:46+05:30 IST