Abn logo
May 22 2020 @ 15:18PM

రిషికపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లపై అనుచిత వ్యాఖ్యలు.. బాలీవుడ్ క్రిటిక్‌ కేఆర్‌కేపై ఎఫ్‌ఐఆర్

ముంబై: సెలబ్రిటీలపై, సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే)పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దివంగత బాలీవుడ్ నటులు రిషికపూర్, ఇర్ఫాన్‌ఖాన్‌లపై తన ట్విటర్ ఖాతాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ యువసేన కోర్ కమిటీ సభ్యుడు రాహుల్ కనాల్ ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.


మద్యం షాపులు తెరుస్తున్న ఈ తరుణంలో రిషికపూర్ చనిపోయి ఉండాల్సింది కాదంటూ ఏప్రిల్ 30న కేఆర్‌కే తన ట్విటర్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ మరణించిన రోజున కూడా కేఆర్‌కే ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement