Abn logo
Jun 6 2020 @ 22:41PM

నిర్మాత ఏక్తా కపూర్‌‌‌పై కేసు నమోదు

నిర్మాత ఏక్తా కపూర్‌పై కేసు నమోదైంది. ఆమె తాజాగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్‌లో హిందువుల మనోభావాలను కించపరిచినట్లుగానూ, అలాగే హిందూ దేవతలను అవమానపరిచినట్లుగా ఫిర్యాదు అందడంతో మధ్యప్రదేశ్-ఇండోర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ సిరీస్‌లో ఇండియన్ ఆర్మీని కూడా అవమానపరిచినట్లుగా చూపారని కూడా కేసు నమోదు చేశారు.


కేవలం ఏక్తా కపూర్‌పైనే కాకుండా డైరెక్టర్‌ పంఖుడి రోడ్రిగ్స్‌, స్క్రీన్‌  రైటర్ జెస్సికా ఖురానాపై కూడా కేసు నమోదు చేసినట్లు ఇండోర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లుగా అక్కడి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ సిరీస్‌లోని అభ్యంతరకరమైన సీన్లను తొలగించినట్లుగానూ, ఎవరి మనోభావాలనో కించపరచాలని ఈ సిరీస్ నిర్మించలేదని నిర్మాత ఏక్తా కపూర్ తరపు నుంచి మీడియాకు సమాచారం అందినట్లుగా తెలుస్తుంది.

Advertisement
Advertisement
Advertisement