గుజరాత్‌లో 100 మంది గిరిజనులు converting..9మందిపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2021-11-16T13:22:57+05:30 IST

గుజరాత్‌ రాష్ట్రంలో 100 మందికి పైగా గిరిజనులను ఇస్లాంలోకి మార్చినందుకు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు....

గుజరాత్‌లో 100 మంది గిరిజనులు converting..9మందిపై పోలీసు కేసు

భరూచ్ : గుజరాత్‌ రాష్ట్రంలో 100 మందికి పైగా గిరిజనులను ఇస్లాంలోకి మార్చినందుకు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.భరూచ్ జిల్లాలోని అమోద్ తాలూకాలోని కంకరియా గ్రామంలోని వాసవ హిందూ కమ్యూనిటీకి చెందిన 37 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా గిరిజనులు డబ్బు, ఇతర ప్రలోభాల వల్ల వారి విశ్వాసాన్ని మార్చుకున్నారని అమోద్ పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు.విదేశాల్లో సేకరించిన నిధులను ఉపయోగించి గిరిజనులను ఇస్లాం మతంలోకి మార్చారని లండన్‌లో నివసిస్తున్న స్థానిక వ్యక్తితో సహా తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


నిందితులు హిందువులైన గిరిజనులకు డబ్బులు ఇచ్చి ఇస్లాం మతంలోకి మార్చారని భరూచ్ పోలీసులు కేసు పెట్టారు.ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్న భరూచ్ జిల్లాలోని నబీపూర్‌కు చెందిన ఫెఫ్దావాలా హాజీ అబ్దుల్ మత మార్పిడి కోసం విదేశాల నుంచి నిధులు సేకరిస్తూ ఉండేవారని పోలీసులు చెప్పారు.ముస్లిం ఛాందసవాదులు కొందరు అక్రమంగా మతమార్పిడి కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. 9మంది నిందితులపై గుజరాత్ మత స్వేచ్ఛ (సవరణ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 120 బి, 153 బి, సి, 506 ల కింద కేసులు పెట్టామని పోలీసులు వివరించారు. 

Updated Date - 2021-11-16T13:22:57+05:30 IST