శివమొగ్గ : కర్ణాటక రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్య తర్వాత రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ నేత చన్నబసప్పలపై శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.స్థానిక కోర్టు ఆదేశాల మేరకు శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఫిర్యాదు ఆధారంగా మేం కేసు నమోదు చేశాం,దీనిపై విచారణ సాగుతోంది’’ అని శివమొగ్గలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బీఎం లక్ష్మీ ప్రసాద్ చెప్పారు.ఫిబ్రవరి 20వతేదీన ఆదివారం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష (23) హత్యకు గురయ్యాడు.ఈ హత్య తర్వాత శివమొగ్గలో దహనం, రాళ్లదాడి సంఘటనలు జరిగాయి.ఇళ్లు,వాణిజ్య సంస్థలపై దాడి చేసి బైకులను తగులబెట్టి రాళ్లు రువ్వారు.హత్య తర్వాత ప్రాంతంలో అశాంతి నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. శివమొగ్గలో 1,200 మంది పోలీసులను మోహరించారు.
ఇవి కూడా చదవండి