సీఎంపై నకిలీ వీడియో ట్వీట్.. కాంగ్రెస్ సీనియర్ నేతపై ఎఫ్ఐఆర్..

ABN , First Publish Date - 2020-06-15T20:28:59+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..

సీఎంపై నకిలీ వీడియో ట్వీట్.. కాంగ్రెస్ సీనియర్ నేతపై ఎఫ్ఐఆర్..

భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ సహా 11 మందిపై భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై సోషల్ మీడియాలో ఓ నకిలీ వీడియో షేర్ చేశారంటూ బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ 465, 500, 501 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. మద్యం విధానంపై చౌహాన్ మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని షేర్ చేసుకోవడం ద్వారా సీఎం చౌహాన్ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ఈ వీడియో షేర్ చేస్తున్న వారిని సీఎం చౌహాన్ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ట్విటర్లో షేర్ చేసిన డిగ్గీ.. తర్వాత దాన్ని డిలీట్ చేయడం గమనార్హం.

Updated Date - 2020-06-15T20:28:59+05:30 IST