లఖ్‌నవూ: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఉత్తరప్రదేశ్‌లోని పుర్ఖాజీ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నేత ప్రమోద్ ఉత్వాల్ సహా ఆయన మద్దతుదారుల్లో 27 మందిపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమోద్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. ఆయన చుట్టు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు గుమిగూడి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ప్రమోద్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.
అయితే రెండు రోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 2,500 కార్యకర్తలపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. యోగి కేబినెట్ నుంచి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరం సింగ్ సైనీలు శుక్రవారం అఖలేష్ యాదవ్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. కాగా, ఈ కార్యక్రమం అనుమతి లేకుండా జరిగిందని ఎన్నికల సంఘం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ప్రమోద్ ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు.