సీఎం రోడ్ షోలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన...బీజేపీ నేతపై కేసు

ABN , First Publish Date - 2020-10-20T12:58:02+05:30 IST

ఇండోర్ సన్వర్ తహసీల్ లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్ షోలో కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించిన బీజేపీ నాయకుడు దినేష్ భవసర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు....

సీఎం రోడ్ షోలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన...బీజేపీ నేతపై కేసు

ఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్ సన్వర్ తహసీల్ లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్ షోలో కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించిన బీజేపీ నాయకుడు దినేష్ భవసర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రోడ్ షోలో ఐదు వాహనాలకు అనుమతి ఉండగా, 25 వాహనాలు వీధుల్లో తిరిగాయని, సామాజిక దూరం పాటించలేదని, బీజేపీ సభ్యులు మాస్కులు ధరించలేదని బీజేపీ నేత దినేష్ భవసర్ పై సన్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి   తులసీ సిలావత్ కు మద్ధతుగా సీఎం చౌహాన్ రోడ్ షో లో పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-20T12:58:02+05:30 IST