రష్యా భద్రతకు హామీ ఇవ్వండి.. స్వీడన్, ఫిన్లాండ్‌కు పుతిన్ లేఖ

ABN , First Publish Date - 2022-03-03T20:17:11+05:30 IST

స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో తమ దేశ భద్రత విషయంలో హామీ ఇవ్వాలని ఆ రెండు దేశాలను పుతిన్ కోరారు. రష్యాతో స్వీడన్, ఫిన్లాండ్ సరిహద్దును పంచుకుంటున్నాయి.

రష్యా భద్రతకు హామీ ఇవ్వండి.. స్వీడన్, ఫిన్లాండ్‌కు పుతిన్ లేఖ

స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో తమ దేశ భద్రత విషయంలో హామీ ఇవ్వాలని ఆ రెండు దేశాలను పుతిన్ కోరారు. రష్యాతో స్వీడన్, ఫిన్లాండ్ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రెండు దేశాలు నాటోలో చేరితే, తమ దేశానికి ఎప్పటికైనా హాని ఉంటుందని రష్యా భావిస్తోంది. దీంతో తమ దేశ భద్రత విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నాడు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతవారం రష్యా ఆ దేశాలకు వార్నింగ్ కూడా ఇచ్చింది. నాటోలో చేరిక నిర్ణయం వెనుక అమెరికా కుట్ర ఉందని రష్యా ఆరోపించింది. గతవారం నాటో జనరల్ సెక్రటరీతో జరిగిన వర్చువల్ మీటింగ్’లో స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే నాటోలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పాయి. తమ దేశాలు స్వతంత్రమైనవని, భద్రత దృష్ట్యా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు తమకే ఉందని స్పష్టం చేశాయి.

Updated Date - 2022-03-03T20:17:11+05:30 IST