ఈ కిట్ తో ఇంట్లోనే కరోనా టెస్ట్

ABN , First Publish Date - 2020-03-26T14:31:44+05:30 IST

ఇకపై కరోనా వైరస్ సోకిందో లేదో ఇంటిలో నుండే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక సంస్థ ఇంటి పరీక్షా కిట్‌ను సిద్ధం చేసింది.

ఈ కిట్ తో ఇంట్లోనే కరోనా టెస్ట్

లండన్: ఇకపై కరోనా వైరస్ సోకిందో లేదో ఇంటిలో నుండే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక సంస్థ ఇంటి పరీక్షా కిట్‌ను సిద్ధం చేసింది. ఈ యంత్రంలో ఒక చుక్క రక్తాన్ని వేయగానే నివేదిక వస్తుంది. ఈ టెస్టింగ్ కిట్‌తో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) ప్రభుత్వం 3.5 మిలియన్ యాంటీబాడీ పరీక్షలు చేసింది. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రజలకు ఈ పరీక్ష ఎలా చేసుకోవాలో వివరిస్తారు. ఈ పరీక్షా కిట్ వారం రోజుల్లో మార్కెట్ లోకి  వస్తుందని ఇంగ్లాండ్ నేషనల్ ఇన్ఫెక్షన్ సర్వీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షరోన్ పీకాక్...  సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీకి నివేదించారు. ప్రభుత్వం దీనిని త్వరలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. 

Updated Date - 2020-03-26T14:31:44+05:30 IST