Single-Use Plasticపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా!

ABN , First Publish Date - 2022-07-02T00:44:40+05:30 IST

ఒకసారి వాడే పారేసే ప్లాస్టిక్ (SUP) వస్తువులను వినియోగిస్తే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని

Single-Use Plasticపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా!

న్యూఢిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (SUP) వస్తువులపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) హెచ్చరించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి లక్ష రూపాయల జరిమానా, లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష తప్పదన్నారు.


19 ఎస్‌యూపీ వస్తువులపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించే యూనిట్లకు ఈ నెల 10వ తేదీ వరకు నోటీసులు జారీ చేస్తామని, ఆ తర్వాత మాత్రం చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎస్‌యూపీ వస్తువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని మంత్రి చెప్పారు. వాటికి ప్రత్యామ్నాయాలను అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-02T00:44:40+05:30 IST