మాస్కు లేకపోతే రూ.100 జరిమానా

ABN , First Publish Date - 2021-04-21T05:01:16+05:30 IST

ప్రాణాంతక కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మాస్కు లేకపోతే రూ.100 జరిమానా

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

కడప(క్రైం), ఏప్రిల్‌ 20: ప్రాణాంతక కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వైరస్‌ నియంత్రణలో ప్రజలు తమవంతు బాధ్యతను గుర్తించి పోలీసుశాఖకు సహకరించాలన్నారు. ఇప్పటికే తమ శాఖ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

Updated Date - 2021-04-21T05:01:16+05:30 IST