మహిళల రైలు బోగీల్లో ప్రయాణం

ABN , First Publish Date - 2022-05-23T16:57:56+05:30 IST

మహిళల రైలు బోగీల్లో ప్రయాణం

మహిళల రైలు బోగీల్లో ప్రయాణం

రూ.1.30 లక్షల జరిమానా

ఐసిఎఫ్‌, మే 22: చెన్నై, శివారు ప్రాంతాల్లో మహిళల రైలు బోగీల్లో ప్రయాణించిన పురుషుల వద్ద నుంచి రూ.1.30 లక్షలు జరిమానా వసూలుచేశారు. మహిళల కోసం కార్యాలయాల సమయంలో ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు సాధారణ విద్యుత్‌ రైళ్లలో వారి కోసం తలా రెండు బోగీలు కేటాయించారు. ఈ పెట్టెల్లో ప్రయాణించే పురుషులకు రైల్వే పోలీసులు జరిమానాగా రూ.300 నుంచి రూ.500 వరకు విధిస్తున్నారు. గత 2020లో 205 మంది, 2021లో 62 మంది, ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 119 మందిపై పోలీసులు చర్యలు చేపట్టారు. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 386 మంది ప్రయాణికుల నుంచి రూ.1.30 లక్షల జరిమానా వసూలుచేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-23T16:57:56+05:30 IST