త్వరలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎలా ఉంటుందంటే...

ABN , First Publish Date - 2020-04-07T16:25:05+05:30 IST

దేశంలో లాక్ డౌన్ ముగిసిన తరువాత కరోనావైరస్ వలన కలిగిన నష్టం నుండి బయటపడేందుకు కార్పొరేట్ ప్రపంచం సన్నాహాలు ప్రారంభించింది. వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి, దీర్ఘకాలిక ...

త్వరలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎలా ఉంటుందంటే...

ముంబై: దేశంలో లాక్ డౌన్ ముగిసిన తరువాత కరోనావైరస్ వలన కలిగిన  నష్టం నుండి బయటపడేందుకు కార్పొరేట్ ప్రపంచం సన్నాహాలు ప్రారంభించింది. వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి, దీర్ఘకాలిక ఇబ్బందులను ఎదుర్కోవటానికి కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నాయని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కార్యాలయంలో మాస్కులు ధరించడం, దూరం పాటించడం  తదితర చర్యలు తీసుకోనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అధ్యక్షులు  సంగీతా రెడ్డి మాట్లాడుతూ ... ఇకపై ఉద్యోగులు మరింత చురుకుగా ఉండాలి. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా  ఉండకూడదన్నారు. దీనితో పాటు కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగించడంతోపాటు రోజువారీ లక్ష్యాలపై  దృష్టి సారించాలన్నారు. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సీఈఓ వివేక్ గంభీర్ మాట్లాడుతూ... సంస్థాగతంగా పలు చర్యలు తీసుకోవాలి. కర్మాగారాలను త్వరలో తెరవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎదురయ్యే సవాళ్ళను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోవాలన్నారు. గోద్రేజ్ ప్రాపర్టీస్ చైర్మన్ పిరోజ్జా గోద్రేజ్ మాట్లాడుతూ కార్యాలయాలు తెరుచుకున్నాక సంబంధిత సంస్థలు ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం,వైద్యుల సలహాలను పాటించడం తప్పనిసరి అని అన్నారు. 

Updated Date - 2020-04-07T16:25:05+05:30 IST