Jul 22 2021 @ 22:40PM

ఈ పిక్‌లో రౌండ్ చేసిన దర్శకుడెవరో కనిపెట్టగలరా?

పై పిక్‌లో రౌండ్ చేసి ఉన్న దర్శకుడెవరో కనిపెట్టగలరా? అందరికీ సుపరిచితమైన వ్యక్తే. కనుక్కోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. కాస్త మనసు పెట్టారంటే ఆ మనిషెవరో తెలిసిపోతుంది. పిక్‌లో కాస్త బలంగా కనిపిస్తున్నాడు కానీ ఇప్పుడాయన అంత బలంగా లేడు. కానీ బలమైన చిత్రాలు మాత్రం తీస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లోని మరో స్టార్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇంకా గుర్తు పట్టలేకపోతే.. ఓ చిన్న క్లూ ఏంటంటే ఈ దర్శకుడికి, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి ఉన్నట్లే సినిమా పేర్ల విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది. ఇంకా తెలియలేదా? అయితే ఈ దర్శకుడికి ఉన్న ఇంకో గ్రేట్ క్వాలిటీ.. ఆయన పెన్ను నుంచి వచ్చే మాటలకు ఫిదా అయిపోయేవారు ఎందరో ఉన్నారు. అర్థమైందా?