Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘హెరాయిన్’ బిగ్‌బాస్ ఎవరో తేల్చండి: దేవినేని ఉమ

విజయవాడ: రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల హెరాయిన్ అక్రమ రవాణా వెనుక ఉన్న బిగ్‌బాస్ ఎవరో కేంద్ర నిఘా సంస్థలు తేల్చాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ రూ.72 వేల కోట్ల విలువచేసే హెరాయిన్ పట్టుబడినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఫోర్టులు తెలుగు వారి అధీనంలో ఉండగా.. రెండేళ్లలో వాటన్నింటినీ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు.


ఆఖరికి నెత్తిమిద జుట్టును కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే రేషన్ తక్కువకు కొనుగోలు చేసి కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్నారని.. దీనిపై మంత్రులు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మత్తు మందు కారణంగా రాష్ట్రంలో దాడులు పెరిగాయని చెప్పారు. అధికారుల కారుల్లోనే మత్తుమందు డబ్బులు విచ్చలవిడిగా రవాణా అవుతోందని ఆయన ఆరోపించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement