ఎలోన్ మస్క్‌కు... ఫైనాన్స్ ట్విట్టర్ కొనుగోలుకు మార్గం సుగమం

ABN , First Publish Date - 2022-05-06T01:24:00+05:30 IST

ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్న క్రమంలో టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ $7 బిలియన్లకు పైగా కొత్త ఫైనాన్సింగ్‌ను పొందనున్రునా.

ఎలోన్ మస్క్‌కు... ఫైనాన్స్  ట్విట్టర్ కొనుగోలుకు మార్గం సుగమం

న్యూయార్క్ : ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్న క్రమంలో టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ $7 బిలియన్లకు పైగా కొత్త ఫైనాన్సింగ్‌ను పొందనున్రునా. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు కోసం కొత్త ఫైనాన్సింగ్ కమిట్‌మెంట్లలో $7.139 బిలియన్లను పొందినట్లు కంపెనీ ఫైలింగ్ గురువారం వెల్లడించింది. ఫైనాన్సింగ్‌ చేసినవారిలో... ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, వై క్యాపిటల్ సహా  సీక్వోయా క్యాపిటల్ ఫండ్ ఉన్నాయి. గత నెలలో, మస్క్ ట్విట్టర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

Read more