Abn logo
Jun 3 2020 @ 05:45AM

‘ఆదివాసీ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి’

ఇచ్చోడరూరల్‌, జూన్‌ 2: కరోనా నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ వల్ల ఆదివాసీలు ఆర్థికంగా నష్ట పోయినందున ప్రతీ ఆదివాసీ కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయం, ఆరు నెలలు రేషన్‌ను ఉచితంగా ఇవ్వాలంటూ ప్లకార్డుల తో నిరసన తెలిపారు. మంగళవారం ఇచ్చోడలోని కొము రంభీం చౌరస్తా వద్ద తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) ఆధ్వర్యంలో ప్లకార్డు ప్రదర్శన చేశారు. ఆది వాసీ రైతులకు ఉచితంగా విత్తనాలు, క్రిమి సంహారక మందులు, ఎరువులు అందించాలని, జీవో నంబర్‌ 3ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్ర మంలో సంఘం జిల్లా కోశాధికారి ఆత్రంకిష్టన్న, మండల అధ్యక్షుడు సోమేష్‌, శ్రీనివాస్‌, రాజు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement