Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇళ్లు కూలిన వారికి ఆర్థికసాయం

ఎర్రగుంట్ల, నవంబరు 26:  భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన వారికి నగరపంచాయతి ఛైర్మన్‌ ఎం.హర్షవర్దన్‌రెడ్డి శుక్రవారం చెక్కులను పంపిణీచేశారు.  మండలంలో 17మంది ఇళ్లు కూలిపోయినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారికి ప్రభు త్వం మంజూరు చేసిన రూ.95,100చెక్కును లబ్దిదారులకు తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీచేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, ఉపమండలాధ్యక్షుడు మల్లుమోహన్‌రెడ్డి,   తహసీల్దార్‌ ఏ.నాగేశ్వరరావు, మండల వైసీపీ ఇన్‌చార్జి ఎం.సురేంద్రనాథ్‌రెడ్డి, సర్పంచి వాసుదేవరెడ్డి,  కౌన్సిలర్లు నాగిరెడ్డి, ఆలి, ఆర్‌ఐలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement