Abn logo
Apr 15 2021 @ 23:10PM

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

పెండ్లిమర్రి, ఏప్రిల్‌ 15: నందిమండలం గ్రామానికి చెందిన గంగయ్య బోదకొట్టం గత నెల 16న విద్యుదాఘాతంతో కాలిపోయింది. బాధిత కు టుంబ  సభ్యులకు గురువారం నందిమండలంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉ న్నత పాఠశాలలో 20 04వ సంవత్సరం పదో త రగతి పూర్వ విద్యార్థులు రూ.40వేలు ఆర్థిక సాయమందించారు. ఆర్థిక సాయం అందించిన వారు గంగయ్య కుమారుడు గంగాధర్‌తో కలిసి చదువుకున్న వారు. తన క్లాస్‌మేట్‌ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వారు రూ.40వేలు సేకరించి  అందించారు.

Advertisement
Advertisement
Advertisement