ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగికి ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-07-25T06:32:44+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్థానిక అడపాల వీధిలో నివాసం ఉంటున్న ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి వేమారెడ్డి ఇల్లు కూలిపోయింది.

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగికి ఆర్థికసాయం

కదిరిఅర్బన, జూలై 24: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్థానిక అడపాల వీధిలో నివాసం ఉంటున్న ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి వేమారెడ్డి ఇల్లు కూలిపోయింది. దీంతో ఇంటిలోని నిత్యావసర వస్తువులు, వస్తుసామగ్రి నీట మునిగిపోయింది. రిటైర్డ్‌ ఉద్యోగిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో  ఎనఎం యూ అసోసియేషన ఆధ్వర్యం లో విరాళాలు సేకరించారు. విరాళాల రూపంలో వచ్చిన మొత్తాన్ని రూ. 55 వేలు శనివారం వేమారెడ్డికి అందజేశారు. రిటైర్డ్‌ ఉద్యోగికి కష్టకాలంలో ఆదుకున్న డిపో ఉద్యోగులను డీఎం ప్రశంశించారు. తనకు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రిటైర్డ్‌ ఉద్యోగి తెలిపారు. కార్యక్రమంలో ఎనఎం యూ అసోసియేషన  నాయకులు హరిమోహన, ఎనవీ రమణ,బైరిశెట్టి, ఓబు లేసు, గంగిరెడ్డి, రామక్రిష్ణ, రమణ, రవీంద్ర, ఎస్‌పీ రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T06:32:44+05:30 IST